నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 07 : రామసముద్రం ఎంపిపి కుసుమ కుమారి సంతాప సభ కార్యక్రమం శుక్రవారం కుటుంబ సభ్యులు, వివిధ పార్టీ నాయకులు ఎంపిపి కుసుమ కుమారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కుసుమ కుమారి భర్త డాక్టర్ బి. సుందరం, కుమారుడు సంస్కార్, కుమార్తె స్పందన, ఫాస్టర్స్ డేవిడ్, పీటర్ రాజేష్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, శ్రేయోభిలాషులు పరలోకంలో ఉన్న కుసుమ కుమారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. సంతాప సభలో పలువురు మాట్లాడుతూ ఆమె చేసిన సేవా కార్యక్రమాలు గురించి క్లుప్తంగా వివరించారు. హాస్పిటల్ కు వచ్చిన పెషేంట్ లకు, డబ్బులు లేని పేద వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసేవారని ఆమెని కొనియాడారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆమె సేవలు కొనియాడారు.
Reporter
Namitha News