నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పరిధి లోని కర్ణాటక భార్డర్ లో ఉన్న ఆవణి రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మూడవ సోమవారం పురస్కరించుకొని భక్తి శ్రేద్దలతో దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామున ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్సితులు పంచామృతాలతో పరమశివుడికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. బెంగళూరు నుండి పలు రకాల పుష్పాలు తెచ్చి స్వామి వార్లకు అలంకరించి భక్తులకు దర్శనం కల్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు . ఈసందర్భంగా అవణి గ్రామ ప్రజలు, రాజు క్షత్రియ కుటుంబ సభ్యులు భజనలు, శివనామ కీర్తనలతో రామలింగేశ్వర స్వామి దేవాలయం దద్దరిల్లాయి.అవణి రాజు క్షత్రియ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్త జనం వేళ్ళ సంవత్సరాలు చరిత్ర గల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు మహిళలు తెల్లవారుజామునే తరలి వచ్చారు.కార్తీక సోమవారం రోజున ఆవణి రాజు క్షత్రియ కుటుంబ సభ్యులు దీపోత్సవం కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయంలో రాజు క్షత్రియ ఆధ్వర్యంలో భక్తుల అన్న దానం, తీర్థప్రసాదాలు అందజేశారు.
Admin
Namitha News