నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జనవరి 23 : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం లో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా పట్టణం లోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు స్థానిక ఆర్.డి.ఓ. పావని గారి ఆధ్వర్యంలో ప్రజలకు తమ ఓటు యొక్క విలువ, ప్రాముఖ్యతను తెలియచేస్తూ, ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ ఓటు యొక్క ప్రాముఖ్యత ను చాటుతూ ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులు. ఈ కార్యక్రమం లో ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News