నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 05 ః తంబళ్లపల్లి నియోజకవర్గ కేంద్రంలో 2047 విజన్ అభివృద్ధి పనులలో భాగంగా జిల్లా కలెక్టర్ తంబళ్లపల్లె ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన పనులను స్వయంగా పరిశీలించి 3.5 మీటర్ల రోడ్డును 5.5 మీటర్లు తో పాటు డ్రైనేజీ కాలువలు నిర్మాణాలు చేపట్టాలని కాంట్రాక్టర్లు రవీందర్ రెడ్డి, సూర్య ప్రకాశ్ రెడ్డిలను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు నేడు ఆర్టీసీ బస్టాండ్ కు విశాలమైన రోడ్డుతో పాటు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు నిర్మాణాలతో బస్టాండ్ కు మహర్దశ పట్టింది. బస్టాండ్ తో పాటు బస్టాండ్ కాలనీ,మసీదు వీధి, శ్రీనివాస కాలనీ, సాలె వీధులలో వేసిన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ పనులు నాణ్యతా లోపం లేకుండా నిర్మించడంతో స్థానిక టిడిపి నేతలతో పాటు ప్రజలు కూటమి ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు
Reporter
Namitha News