Sunday, 26 July 2026 09:55:11 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో మహిళల ఆరోగ్య పరిరక్షణ మరియు వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన

ఫెమి 9 ప్రతినిధులచే విద్యార్ధినులకు అవగాహన

Date : 04 December 2025 07:26 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 04 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ (WEC) వారి ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన స్త్రీ సాధికారికత భారతదేశం ఫెమీ–9 సంస్థ ప్రతినిధులు మహిళల ఆరోగ్య పరిరక్షణ మరియు వ్యక్తిగత పరిశుభ్రత అనే అంశం పై విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కుప్పం కు చెందిన ఫెమి 9 - మేనుస్ట్రుల్ హైజీన్ ఎడ్యుకేటర్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్స్ అనంత్.ఎం మరియు జయశ్రీ.కె పాల్గొన్నారు. కార్యక్రమంలో అనంత్ మాట్లాడుతూ మెన్స్ట్రుయేషన్‌కు సంబంధించిన అలవాట్లు, సవాళ్లు, హైజీనిక్ పద్ధతులు మరియు సురక్షిత శానిటరీ ఉత్పత్తుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మహిళలు, ముఖ్యంగా గ్రామీణ మరియు వెనుకబడిన వర్గాల్లో ఉన్నవారు, శుభ్రమైన మరియు గౌరవప్రదమైన విధంగా మెన్స్ట్రుయేషన్‌ను నిర్వహించుకోవడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రపంచ మరియు దేశ స్థాయి గణాంకాలు ప్రదర్శిస్తూ, మెన్స్ట్రుయేషన్‌పై ఉన్న అపోహలు, అవగాహన లోపం కారణంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేశారు. ముఖ్యంగా భారతదేశంలో మహిళల క్యాన్సర్ కేసుల్లో పెరుగుదల ఆందోళన కలిగించే అంశమని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ ఛైర్‌పర్సన్ డాక్టర్ ఎస్. షణ్ముగ ప్రియా మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం మరియు వ్యక్తిగత పారిశుద్ధ్యం పై ప్రతి యువతికి అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ కె.వి. గీతాదేవి, కె. కవిత, ఎం.బి.ఏ మరియు ఎం.సి.ఏ మొదటి సంవత్సరం విద్యార్థినిలు, యన్.ఎస్.ఎస్ వాలెంటీర్స్ పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :