నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 30 : పుంగనూరులో మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో కూటమి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో సంబరాలు మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు బాణాసంచా పేల్చి, కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మదనపల్లె జిల్లా ఏర్పాటు వల్ల ఈ ప్రాంతానికి పరిపాలనా సౌలభ్యం పెరిగి, అభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయని నాయకులు పేర్కొన్నారు. ఎన్నాళ్లుగానో ప్రజలు ఎదురుచూస్తున్న జిల్లా ప్రకటన నెరవేరడంతో స్థానికుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాధవరెడ్డి, విశ్రాంత డిఎస్పి తెలుగుదేశం పార్టీ నాయకుడు సుకుమార్ బాబు, జనసేన జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు చైతన్య రాయల్, వెంకట ముని సద్దాం గిరి ఇబ్రహీం చంద్ర తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News