Monday, 27 July 2026 10:53:28 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

నూతన అధ్యాపకులతో కళకళలాడుతున్న బీటీ కళాశాల కళాశాల పూర్వ వైభావానికి సమష్టిగా కృషి చేద్దాం: ప్రిన్సిపాల్ డా. గన్నవరం శ్రీదేవి

Date : 10 July 2026 05:08 PM Views : 74

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నూతన అధ్యాపకులతో కళకళలాడుతున్న బీటీ కళాశాల కళాశాల పూర్వ వ8భావానికి సమష్టిగా కృషి చేద్దాం: ప్రిన్సిపాల్ డా. గన్నవరం శ్రీదేవి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అధ్యాపకుల బదిలీల్లో భాగంగా స్థానిక చారిత్రాత్మక బెసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐదుగురు నూతన అధ్యాపకులు బదిలీపై వచ్చి శుక్రవారం విధుల్లో చేరారు. దీంతో కళాశాలలో అధ్యాపకుల సంఖ్య పెరిగి విద్యా వాతావరణం మరింత బలోపేతమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. గన్నవరం శ్రీదేవి నూతన అధ్యాపకులకు స్వాగతం పలికారు. విద్యార్థుల ప్రవేశాల పెంపుతో పాటు కళాశాల విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా అందరూ సమిష్టిగా కృషి చేసి కళాశాల పూర్వ వైభవానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. బదిలీపై కామర్స్ అధ్యాపకురాలు డా. వి. కృష్ణవేణి, హార్టికల్చర్ అధ్యాపకులు డా. పి. రవీంద్రనాథ్ రెడ్డి, భౌతిక శాస్త్ర అధ్యాపకులు డా. ఎస్. గురుప్రసాద్, రసాయన శాస్త్ర అధ్యాపకులు టి. బాలాజీ, ఎల్. ప్రదీప్ కళాశాలలో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు, కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అధ్యాపక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎం. రాఘవరెడ్డి, వృక్షశాస్త్ర అధ్యాపకురాలు డా. శైలజ సి.ఎస్., తెలుగు అధ్యాపకులు డా. డేరంగుల శ్రీనివాసులు, రసాయన శాస్త్ర అధ్యాపకులు డా. జి. చిన్నారెడ్డి తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :