Monday, 27 July 2026 03:32:47 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సాగు విస్తీర్ణం, పాల ఉత్పత్తి పెంపుపై కలెక్టర్ నిశాంత్ కుమార్ దిశానిర్దేశం

యుద్ధ ప్రాతిపదికన జలధార పనులను పూర్తి చేయాలి

Date : 01 May 2026 07:50 PM Views : 118

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 01 : జిల్లా వ్యాప్తంగా చేపట్టిన జలధార 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 4,938 పనులను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ పనులన్నింటినీ నిర్దేశిత కాలపరిమితిలోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని, అందుకు సంబంధిత అధికారులు బాధ్యతతో కృషి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో మండల వారీగా కాస్కేడ్స్ నింపేందుకు చేపట్టిన చర్యలు, అందుబాటులో ఉన్న నీటి పరిమాణం, పనులు పూర్తయ్యాక నీటి లభ్యతపై సంబంధిత అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జలధార పనుల ఫలితంగా చెరువుల్లో నీటి నిల్వ పెరుగుతుందని, దీనిని ఉపయోగించుకొని ఆర్‌ఎస్‌కే వారీగా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. రైతులకు పంటల సాగు, డ్రిప్ ఇరిగేషన్, ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పించి ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాన్సూన్ అనంతరం పాల ఉత్పత్తి పెంపునకు పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని, శాఖల సమన్వయంతో రైతులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఉన్న 3,700 చెరువులు, 332 ఆర్‌ఎస్‌కే కేంద్రాల ఆధారంగా సాగు విస్తీర్ణం పెంపుపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. చెరువుల పరిధిలోని బోర్లు, రీఛార్జ్ పరిస్థితి, అదనంగా సాగు చేయగల విస్తీర్ణం, పంటల ఎంపిక వంటి అంశాలపై సూక్ష్మస్థాయి కార్యాచరణ రూపొందించి రైతులకు వివరించాలని సూచించారు. గత ఖరీఫ్, రబీ సీజన్లతో పోలిస్తే ఈసారి రెట్టింపు సాగు లక్ష్యంగా పెట్టుకోవాలని పేర్కొన్నారు. అలాగే ప్రతి చెరువు పరిధిలో కనీసం 20 మంది పాడి రైతులను ప్రోత్సహించి, క్రాస్‌బ్రీడ్ ఆవులు, ఎద్దులు పెంపుతో పాల ఉత్పత్తి పెంచాలని సూచించారు. అదనంగా సుమారు 10,000 పశువులు పెంచితే రోజుకు లక్ష లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయని, రైతులకు రోజుకు సుమారు ₹60 లక్షల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అటవీ శాఖ పరిధిలో చేపట్టాల్సిన జలధార పనులకు అవసరమైన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని, సంబంధిత అధికారులతో సమన్వయం పెంచాలని ఆదేశించారు. జలధార పనులకు సహకరిస్తున్న దాతలను మండల స్థాయి సమావేశాలకు ఆహ్వానించి గౌరవించాలని, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో వారిని సన్మానిస్తామని తెలిపారు. అనంతరం నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరాలు సమర్పించగా, వాటిపై కలెక్టర్ సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీవోలు, డ్వామా పీడీ, జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: