నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 14 ః తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ శైవ క్షేత్రానికి ఐదోసారి పుష్పాలంకరణ చేసే భాగ్యం మా కుటుంబానికి దక్కడం పూర్వజన్మ సుకృతమని గోపిదిన్నె పంచాయతీ చెరువు ముందరపల్లి కు చెందిన రియల్టర్(బెంగళూరు మల్లి) నల్ల గుండ్ల మల్లికార్జున రెడ్డి, హేమలత దంపతులు కొనియాడారు. ప్రతి ఏటా సుమారు ఐదు లక్షల ఖర్చుతో ఆలయంలో బెంగళూరు నుండి వందలాది రకాల ఫల పుష్పాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఓ సామాన్య రైతుబిడ్డగా జీవితం ప్రారంభించిన మల్లికార్జున రెడ్డి శివయ్య సేవలో తరించి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదగడానికి మల్లయ్య కొండ మహా శివుడే విజయ సోపానంగా నిలవడంతో ఆ కుటుంబం దశాబ్ద కాలంగా వేలాది మందికి కులం, మతం, ప్రాంతం, పార్టీలకతీతంగా తంబళ్లపల్లె నుండి బెంగుళూరు వరకు ఆపన్న హస్తం అందించి నిరుపేదలు, అభాగ్యులకు, తనకున్నంతలో ఆర్థిక సహాయం చేసి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలవడం ప్రశంసనీయమని సర్వత్ర హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా నల్లగుండ్ల మల్లికార్జున రెడ్డి, హేమలత దంపతులు మాట్లాడుతూ మా కుటుంబం ఈ స్థాయికి చేరడానికి మల్లయ్య కొండ మహాశివుడేనని ఆయన ఆశీస్సులతో భవిష్యత్తులో సైతం శక్తి వంచన లేకుండా నిరుపేదలకు మరింత సేవ చేసే భాగ్యం కల్పించి తంబళ్లపల్లె ప్రాంత ప్రజలు పాడి పంటలు, సుఖ సంతోషాలతో జీవించాలని ఆ పార్వతీ పరమేశ్వరులను ఆకాంక్షించినట్లు తెలిపారు.
Reporter
Namitha News