Monday, 27 July 2026 10:53:23 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రాజకీయ కక్షతో నా వ్యక్తిత్వ హననం సీసీ కెమెరా ఫుటేజ్‌తో నిజాలు వెల్లడిస్తున్నా : మైఫోర్స్ మహేష్

Date : 08 February 2026 05:34 PM Views : 165

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి: జనసేన పార్టీకి కానీ, తనకు కానీ ఎటువంటి సంబంధం లేని ఒక చిన్న పార్కింగ్ గొడవను రాజకీయ కక్షతో వక్రీకరించి తనపై తప్పుడు ఆరోపణలు మోపడం తీవ్ర అన్యాయమని జనసేన పార్టీ నేత మైఫోర్స్ మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 29న మదనపల్లిలో తన తమ్ముడు నిర్వహిస్తున్న ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ సమీపంలో జరిగిన ఘటనను ఆధారంగా చేసుకుని తన వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సీసీ కెమెరా ఫుటేజ్‌ను జిల్లా ప్రజల ముందుకు తీసుకొచ్చి నిజాలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు. సీసీ ఫుటేజ్‌లో దాడి చేసింది తమవైపు నుంచి కాదని, ప్రత్యర్థులే దాడికి పాల్పడ్డారనేది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఉమేష్ కత్తితో దాడి చేశాడన్న ఆరోపణ పూర్తిగా అబద్ధమని, ఫుటేజ్‌లో కత్తి మాట అటుంచితే కనీసం గడ్డిపరక కూడా ఎవరి చేతిలోనూ లేదని స్పష్టం చేశారు. అలాగే తాను పిడిగుద్దులతో దాడి చేశాడన్న ఆరోపణ కూడా పూర్తిగా అసత్యమని, తాను ఎవరినీ తాకనూ లేదని సీసీ కెమెరా దృశ్యాల్లో స్పష్టంగా ఉందన్నారు. గత 12 సంవత్సరాలుగా మదనపల్లి జిల్లాలో రాజకీయాల్లో ఉన్న తనపై ఇప్పటివరకు ఏ ఒక్క తప్పుడు పని ఆరోపణ కూడా లేదని మహేష్ పేర్కొన్నారు. తాను ల్యాండ్ గ్రాబింగ్, ఇసుక దోపిడీ, లిక్కర్ వ్యాపారాలు, సెటిల్‌మెంట్లు, పంచాయతీలు వంటి ఏ అక్రమ కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా మద్యం, పొగతాగడం వంటి అలవాట్లు లేవని, నీతి–నిజాయితీ–నిబద్ధతతోనే రాజకీయాలు చేస్తున్నానన్నారు. వ్యాపార స్థలంలో జరిగిన వ్యక్తిగత ఘటనను జనసేన పార్టీకి ముడిపెట్టి పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయాలని ప్రయత్నించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి సీసీ కెమెరా ఫుటేజ్ ప్రజల ముందే ఉందని, నిజం తన వైపే ఉందని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో తనపై జరుగుతున్న ఈ కుట్రను జిల్లా ప్రజలు గమనించాలని, న్యాయం తనకే జరుగుతుందన్న నమ్మకంతో ప్రజల మద్దతు కోరుతున్నట్లు తెలిపారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: