Monday, 27 July 2026 03:12:30 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

వైద్య కళాశాల లను ప్రవేట్ పరం చేసే జి.ఓ. ప్రతులను భోగి మంటల్లో వేసిన సిపిఐ నాయకులు

పేద,మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్యను అందకుండా చేసేందుకు కంకణం కట్టుకున్న కాళకూటమి ప్రభుత్వం - సిపిఐ

Date : 14 January 2026 10:58 AM Views : 192

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - జనవరి 14 : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ (పిపిపి) పేరుతో పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్యను అందకుండా చేసేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టేందుకు కంకణం కట్టుకుని 590,847 జీవోలను తీసుకువచ్చిందని సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. భోగి పండుగను పురస్కరించుకొని బుధవారం ఉదయం ఐదు గంటలకు స్థానిక పిటిఎం రోడ్డు నందు సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భోగిమంటలను వేసి అందులో 590,847 జీవో ప్రతులను దగ్ధం చేశారు. వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం మానుకోవాలని,తక్షణం ప్రజా వ్యతిరేక జీవోలను రద్దు చేయాలని,పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడం మానుకోవాలని,పిపిపి విధానాన్ని రద్దు చేయాలని,ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నడపాలని,కూటమి ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా యస్.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ; నూతన వైద్య కళాశాలలు ఏర్పాటు కోసం భూములు,భవనాల నిర్మాణం,వనరులు,మౌళిక సదుపాయాలతో పాటు సిబ్బందికి వేతనాలు కూడా ప్రభుత్వమే చెల్లించి కళాశాలల నిర్వహణను మాత్రం పిపిపి పేరుతో ప్రైవేటుకు అప్పగించడం ఎంతవరకు సబబో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు మొండిగా వ్యవహరించడం చూస్తుంటే ఇది "కూటమి ప్రభుత్వం" కాదని ఇది "కాళకూటమి ప్రభుత్వమని" ఘాటుగా విమర్శించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు ఎస్. తంబయ్యశెట్టి,ఎం.అష్రఫ్అల్లీ,పి.మంజునాథ్,జి. నారాయణస్వామి,ఎం. గంగులప్ప,హబీబ్, రామచంద్ర,షఫీ,రెడ్డప్ప, గంగాధర్,కిట్టన్న, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :