Sunday, 26 July 2026 12:25:51 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మిట్స్ లో విజయవంతం గా కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ అశ్వ్ 2k26

ప్రతిభ కనబర్చిన వారికి నగదు ప్రోత్సాహక బహుమతులను అందించిన ఛాన్సలర్ విజయభాస్కర్ చౌదరి

Date : 27 March 2026 06:45 PM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -మార్చి 27 : అంగళ్ళు సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ లో అశ్వ్–2కె26 రెండు రోజుల జాతీయ స్థాయి టెక్నో, కల్చరల్, స్పోర్ట్స్ ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి ప్రారంభించారు. 1998 సంవత్సరం లో మదనపల్లి బెంగుళూరు రోడ్డు లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల అని, మదనపల్లి తో పాటు పరిసర ప్రాంతాల వారికి అనువుగా ఉండడం తో మిట్స్ ప్రస్థానం మొదలు, ఆనాటి నుండి అంచెలు అంచేలుగా ఎదిగి నేడు యూనివర్సిటీ స్థాయికి రావడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపారు. మిట్స్ కు A+ గ్రేడ్ రావడం అభినందనీయం అని అన్నారు. తమ యూనివర్సిటీ లో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో ముక్యంగా అత్యుత్తమ మల్టీనేషనల్ కంపెనీలలో వివిధ రాష్ట్రాల లో పనిచేస్తున్నారని, అంతేకాకుండా ఎంతో అత్యుత్తమ స్థానాలలో ఉన్నారని, వారి కలయిక కోసం బెంగళూరు మరియు హైదరాబాద్ లో అల్యూమిని మీట్ నిర్వహించడం జరిగినది అని అన్నారు. కార్యక్రమంలో 1998 సంవత్సరం నుండి 2025 వరకు చదివిన విద్యార్థులు వారి జ్ఞాపకాలను పంచుకున్నారు అని అన్నారు. మిట్స్ విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడాన్ని అభినందిస్తూ, ఇలాంటి వేడుకలు వారి జీవితంలో చిరస్మరణీయ జ్ఞాపకాలను అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ గాయకులు సాగర్, లిప్సిక భాష్యం, మౌనిక యాదవ్, అలాగే సినీ ప్రముఖులు పాల్గొని విద్యార్థులను అలరించారు. “రాకాస” సినిమా ట్రైలర్‌ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. రెండవ రోజు సినీ నటుడు శర్వానంద్ మరియు నటి మాళవిక నాయర్ విద్యార్థులతో మమేకమై ప్రేరణాత్మక సందేశాలు అందించారు. జబర్దస్త్ కళాకారుల హాస్య ప్రదర్శనలు, విద్యార్థుల సాంస్కృతిక మరియు నృత్య కార్యక్రమాలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు వివిధ ఆట పాటలతో మరియు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన “రామాయణం” నాటికకు ప్రేక్షకుల ప్రశంసలు లభించగా, ఉత్తమ ప్రదర్శనగా గుర్తించి ఛాన్సల్లర్ రూ.50,000 నగదు బహుమతిని అందజేశారు. మొత్తం ఫెస్ట్ విజయవంతంగా ముగిసి, విద్యార్థులకు చిరస్మరణీయ అనుభవాలను అందించింది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :