నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : *నిశ్వార్థమైన కళ - నృత్యం* *రాష్ట్ర అధ్యక్షులు (తెలుగు యువత) శ్రీరామ్ చినబాబు ఉద్ఘాటన* *ఘనంగా CDS డ్యాన్స్ అకాడమీ మొదటి వార్షికోత్సవ వేడుకలకు హాజరైన డాన్స్ మాస్టర్ యశ్వంత్* మదనపల్లి : శుక్రవారం రాత్రి మదనపల్లిలోని మాంగళ్య కళ్యాణ మండపంలో CDS crazy DANCE STUDIO మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీరామ్ మాట్లాడుతూ... సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి ఇష్టమైన నృత్యాన్ని వివిధ రూపాల్లో ప్రజలకు చేరువ చేస్తున్న CDS crazy Dance STUDIO వారికి అభినందనలు తెలిపి, రానున్న రోజుల్లో మరింతగా సేవలు అందించాలని కోరారు. శ్రీరామ్ తో పాటు టీడీపీ సీనియర్ నాయకులు యాలగిరి దొరస్వామి నాయుడు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్,జనసేన నాయకురాలు దారం అనిత, దారం హరి, తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, శ్యామ్,సన్నీ, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్, రమేష్, నాగార్జున, విష్ణు రాయల్ మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News