నమిత న్యూస్ - Andhra Pradesh / YSRkadapa : రాజంపేట - మే 23 : రాజంపేట పురపాలక సంఘ టౌన్ ప్లానింగ్ విభాగం ప్రకారం మునిసిపల్ అనుమతి లేకుండా మెయిన్ సర్కిల్, పాత బస్టాండు, ఆర్టీసీ బస్టాండు, రోడ్డు సర్కిల్, రోడ్ల పక్కన, విద్యుత్ స్తంభాలపై ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించారు. ఇలా చేయడం వల్ల మునిసిపల్ ఆదాయం కోల్పోవడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం, ప్రమాదాల అవకాశం పెరగడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ముందుగా అనుమతి తీసుకుని రుసుము చెల్లించి రశీదు ఫ్లెక్సీపై ఉంచాలని సూచించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే మునిసిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు
Reporter
Namitha News