నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జనవరి 09: ఆత్మకూరు మండలంలోని మహిమలూరు గ్రామానికి చెందిన 80 సంవత్సరాల వృద్ధురాలైన నరసమ్మ గత 30 ఏళ్లుగా తాను సాగుబడి చేసుకుంటున్న భూమిని అడ్డగించిన భూస్వామి నా భూమి ని నాకు కాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరినైనా తనపై దౌర్జన్యానికి దిగుతున్నారని , బెదిరింపులు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతో ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి కథనం మేరకు సర్వే నెంబరు 165 /5 లోని నాలుగు ఎకరాల 41 సెంట్లు భూమి లో గత 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఇందులో రెండు ఎకరాల 30 సెంట్లు తనకు ప్రభుత్వం కేటాయించిందని మిగిలిన రెండు ఎకరాల 11 సెంట్లు శివాయి భూమిని తాను సాగు చేసుకుంటూ వస్తున్నానని తెలిపారు. 20 ఏళ్ల క్రితం తన భర్త మృతి చెందిన ఈ పొలం ఆధారంగానే ఎంతో కష్టపడి, సేద్యం చేసుకొంటూ ఐదుగురు ఆడపిల్లలకు వివాహాలు జరిపించానన్నారు. ప్రస్తుతం తనకు ఈ పొలమే జీవనాధారం , వృద్ధురాలైన నాకు దాపుగా ఎవరూ లేరని భూమి ని కాజేయాలని యత్నింస్తున్నారు. ప్రతి ఏడాది లాగే ఇప్పుడు కూడా పొలం దున్ని వరి నాటేందుకు పొలాన్ని సిద్ధం చేశానన్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ పొలం తనదేనంటూ సాగుబడికి అడ్డగించారన్నారు. వరి నాటుకునేందుకు వీలు లేకుండా అడ్డుకొని దాడి చేసేందుకు ప్రయత్నించారని, బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సాగు చేసుకుంటున్న భూమిని తనకు ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నానని తెలిపారు. ఒంటరిగా జీవిస్తున్న తనకు ఇదే జీవనాధారం అని తెలిపారు. తనకు న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్య కైనా పాల్పడుతానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తమ గ్రామంలో జరిగిన గ్రామసభలో తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తహసిల్దార్ సమస్యను పరిశీలించి తగు చర్యలు చేపడతామని తెలిపారు.
Admin
Namitha News