నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 11 : మదనపల్లి సమీపం సమీపంలో అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం వారు మిట్స్ ఐ ఐ సి వారి ఆధ్వర్యంలో జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిట్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి మరియు బెంగళూరు కు చెందిన ఖైద్రే సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సి ఈ ఓ ఎమ్.గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానం దేశాభివృద్ధికి కీలకమని, యువత సృజనాత్మక ఆలోచనలు మరియు నూతన ఆవిష్కరణల ద్వారా సమాజానికి సేవ చేయాలని తెలిపారు. కృత్రిమ మేధస్సు, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, ఆటోమేషన్, ఆరోగ్య రంగాలలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న విధానాన్ని వివరించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఆధునిక సాంకేతిక ధోరణులకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, స్టార్టప్‌లు మరియు పరిశోధనల వైపు ముందడుగు వేయడం చాలా ముఖ్యమని తెలిపారు. యువత కొత్త టెక్నాలజీలపై అవగాహన పెంపొందించుకొని, ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే ప్రపంచస్థాయి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎమ్.శ్రీదేవి, కోఆర్డినేటర్స్ బి.ప్రశాంత్, వి.గీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News