నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 22 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని దిన్నిపల్లె సమీపంలో క్వారీ డస్ట్ తరలింపుపై క్వారీ యజమానురాలు, కొనుగోలుదారు మధ్య వివాదం నెలకొంది.ఇది రెండు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది .రామసముద్రం మండలం ఊ లపాడు పంచాయతి శాన్సిఫాం వద్ద ఉన్నశ్రీ రామ గ్రానైట్స్ ఫ్యాక్టరీ నుండి డస్ట్ కొనుగోలు కోసం మండల కేంద్రానికి చెందిన భాస్కర్ అనే ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వెళ్ళాడు. అయితే డస్ట్ తరలింపు సమయంలో క్వారీ కి భూమి లీజుకు ఇచ్చిన దర్శన్ గౌడ్ కు భాస్కర్ కు మధ్య వివాదం నెలకొంది.దర్శన్ గౌడ్ తనను కులం పేరుతో దూషించారని భాస్కర్ పోలీసులకు పిర్యాదు చేశాడు.అయితే ప్రెస్ రిపోర్టర్ పేరుతో భాస్కర్ తనపై దౌర్జన్యం చేసి,డస్ట్ దొంగతనం ప్రయత్నం చేయగా అడ్డు వచ్చిన తనపై కులం పేరు చెప్పి అట్రాసిటీ కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని,భాస్కర్ తో తనకి ప్రాణహాని ఉందని , భాస్కర్ నుండి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ శివమ్మ పోలీసులకు పిర్యాదు చేసింది.ఇరువురు పిర్యాదు దారుల మద్దతు దారులతో మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ విషయమై ఇరువురు ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని యస్.ఐ. రమేష్ బాబు తెలిపారు.
Reporter
Namitha News