నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 05 : రామసముద్రం మండల ఎస్టీయూ ఎన్నిక ఈరోజు సాయంత్రం స్థానిక ఉన్నత పాఠశాల లో జరిగింది. మండల ఎస్.టి.యు. నూతన అధ్యక్షులుగా ఆయూబ్ ఖాన్ ప్రధాన కార్యదర్శి రమాదేవి ఆర్థిక కార్యదర్శిగా సురేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మండల గౌరవ అధ్యక్షులుగా శివశంకర్ రెడ్డి అసోసియేట్ అధ్యక్షులుగా చెంగల్రాయ చారి అదనపు ప్రధాన కార్యదర్శిగా కేశవ్ కుమార్ మహిళా కన్వీనర్లుగా రాధమ్మ, కుసుమ, సిపిఎస్ కన్వీనర్లుగా కృష్ణమూర్తి, కృష్ణయ్య మైనార్టీ కన్వీనర్లుగా సయ్యద్ బాషా , ఇర్ఫాన్ ఉపాధ్యాయ వాణి కన్వీనర్ గా సుధాకర్, ఉపాధ్యక్షులుగా సోమశేఖర్, షాహిరా, రెడ్డమ్మ , జ్యోతి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరితోపాటు మరో 20 మందిని మండల కార్యవర్గంలో పదిమందిని జిల్లా కార్యవర్గంలో ఎన్నిక చేయడం జరిగింది. జిల్లా కౌన్సిలర్లుగా కడియాల మురళి ,సుబ్బారెడ్డి, ఈ. నరసింహులు ,అనిల్ కుమార్, మనోహర , ప్రకాష్ రెడ్డి, మహీదర్ రావు, జగన్నాథ్ రెడ్డి , వై. నరసింహులు, సుధాకర్ , వెంకట ప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ టి యు ఉపాధ్యక్షుడు కడియాల మురళి రాష్ట్ర కమిటీ కన్వీనర్ సుబ్బారెడ్డి ప్రధానోపాధ్యాయులు మహీదర్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Reporter
Namitha News