నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 04 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె లో దశాబ్దాలుగా తాగునీటి కోసం మహిళలు కటకట లాడిన రోజులు గడిచిపోయాయి. నేడు కూటమి ప్రభుత్వం రాకతో టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ బేరిపల్లి శ్రీనివాసులు టిడిపి అధిష్టానానికి సమస్య తెలిపి తద్వారా జిల్లా పరిషత్ నుండి ఐదు లక్షల నిధులు మంజూరు చేయించారు. కోసువారిపల్లి పాత పంచాయతీ కార్యాలయంలో2000 లీటర్ల సామర్థ్యంతో ఆర్డబ్ల్యూఎస్ డిఈ చంద్రశేఖర్ రెడ్డి, ఎఈఈ వినోద్ కుమార్ ల సహకారంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి గడపకు కేవలం రూ 2 బిందె తాగునీరు అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బేరి శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో సర్పంచిగా తాగునీటి సమస్యలు పరిష్కరించడానికి పడరాని పాట్లు పడ్డామని అయితే నేటి కూటమి ప్రభుత్వం సహకారంతో ఈ ఆరో ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి మహిళ తాగునీరు కష్టం పడరాదని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కోసువారి పల్లి పంచాయతీ తాగునీటితోపాటు ప్రతి గ్రామానికి సిసి రోడ్లు, తాగునీటి పనులు, పలు అభివృద్ధి పనులకు స్థానిక టిడిపి తోబాటు కూటమి నేతలు తనకు పూర్తి సహకారం అందించారని కొనియాడారు
Reporter
Namitha News