నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 07 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్డ్ యూనివర్సిటీ నందు ఎన్.ఎస్.ఎస్ మరియు ఎన్.సి.సి. విద్యార్థులు యూనివర్సిటీ నందు 150వ అంకె తో వందేమాతరం అక్షరాల ఆకారం లో ‘వందేమాతరం’ 150వ స్మారకోత్సవం ను ఘనంగా జరుపుకున్నారు. తరువాత వందేమాతరం గీతం ను విద్యార్థులు మరియు అధ్యాపకులు ఆలపించారు. వందేమాతరం గీతం రచించి నేటికీ 150సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కమాల్ బాషా మాట్లాడుతూ వందేమాతరం యొక్క విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. వందేమాతరం గేయం బెంగాలీ నవల ఆధారంగా ఆనంద్ మట్ లో బకింగ్ చంద్ర చటర్జీ 1875 వ సంవత్సరం నవంబర్ 7వ తేదీన రచన చేసారని, ఆ గేయం స్వతంత్ర ఉద్యమంలో నినాదంగా ఉపయోగపడింది అని, వందేమాతరం గేయం తొలి సారిగా 1882వ సంవత్సరంలో ప్రచురణ చేసారని అన్నారు. దేశానికి స్వతంత్రము వచ్చిన తరువాత ఆ గేయమును భారత ప్రభుత్వం 1950 వ సంవత్సరం జనవరి 24వ తేదీన అధికార గేయంగా గుర్తింపు ఇచ్చింది అని అన్నారు. కార్యక్రమంలో ఎన్. యస్.యస్. ఆఫీసర్ పి. రాజేష్, ఎన్.సి.సి. విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News