నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 19 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వి నవీన్ కు అమృత విశ్వ విద్యాపీఠం, చెన్నై నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టా లభించినట్లు మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. "Certain Investigations on Dynamic Gated Fusion and Lightweight Audio-Visual Models for Multimodal Sentiment Analysis of Product Reviews"("సర్టెన్ ఇన్వెస్టిగేషన్స్ ఆన్ డైనమిక్ గేటెడ్ ఫ్యూజన్ అండ్ లైట్‌వెయిట్ ఆడియో-విజువల్ మోడల్స్ ఫర్ మల్టీమోడల్ సెంటిమెంట్ అనాలిసిస్ ఆఫ్ ప్రొడక్ట్ రివ్యూస్") అనే అంశంపై డాక్టర్ ఎస్. సౌంతర్రాజన్ పర్యవేక్షణలో నిర్వహించిన పరిశోధనకు గాను ఈ పీహెచ్‌డీ పట్టాను ప్రదానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వివిధ మాధ్యమాల ద్వారా వ్యక్తమయ్యే భావోద్వేగాల విశ్లేషణ, కృత్రిమ మేధస్సు ఆధారిత ఆడియో-విజువల్ డేటా విశ్లేషణ, తక్కువ కంప్యూటింగ్ వనరులతో అధిక సామర్థ్యం కలిగిన డీప్ లెర్నింగ్ నమూనాల అభివృద్ధికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు. పీహెచ్‌డీ పట్టా పొందిన వి. నవీన్ ను మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, విభాగాధిపతి డాక్టర్ దినేష్ మరియు అధ్యాపకులు అభినందించారు
Reporter
Namitha News