Sunday, 26 July 2026 12:23:38 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

పది ఫలితాల్లో జిల్లా ప్రధమ స్థానంలో కొర్రకూటి యస్విత

మా ఊరికే గర్వకారణం - సోమశిల డ్యామ్ చైర్మన్ వేలూరుకేశవ చౌదరి

Date : 30 April 2026 08:01 PM Views : 190

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చేజర్ల - ఏప్రిల్ 30 : చేజర్ల మండలం నాగుల వెల్టూరు గ్రామ హైస్కూల్ నందు గ్రామానికి చెందిన సోమశిల ప్రాజెక్టు చైర్మన్ ఏలూరు కేశవ చౌదరి విలేకరుల సమావేశం నిర్వహించారు.తమ ఊరి పాఠశాల విద్యార్థి కొర్రకూటి యశ్విత అనే పదవ తరగతి విద్యార్థినీకి జిల్లాలోని అత్యధికంగా 595 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం తనకెంతో గర్వకారణం గా ఉందని సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు.కేశవ చౌదరి తెలిపారు. గ్రామ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 595 మార్కులు సాధించిన విద్యార్థిని కొర్రకూటి యశ్విత ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. తాను చదివిన ఈ పాఠశాల ఓదశలో విద్యార్థులు లేరని స్కూల్ తొలగించే పరిస్థితి వచ్చిందని అటువంటి పరిస్థితిలో ఈ పాఠశాలను దత్తత తీసుకొని చుట్టుపక్కల విద్యార్థులను తమ హైస్కూల్ కు వచ్చేలా తన సొంత నిధులతో వ్యాన్ ఏర్పాటుచేసి ఇక్కడికి విద్యార్థులు వచ్చి చదువుకునేలా చేసిన ప్రయత్నం ఫలించి అత్యధిక విద్యార్థులు సాధించి జిల్లా స్థాయికి ఈ స్కూలు చేరడంతో పాటు రాష్ట్రంతో పోటీపడే విధంగా అత్యధిక మార్కుల సాధించడం ఎంతో సంతోషంగా ఉందని పాఠశాలకు చెందిన మొత్తం 16 మంది విద్యార్థులు పాస్ కావడం అందులో 50 శాతం మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించడం మండల చరిత్రలోనే మా పాఠశాల ప్రథమం కావడం గర్వపడుతున్నామని ఈ సందర్భంగా వేలూరు. కేశవ చౌదరి తెలిపారు.. రానున్న రోజుల్లో పాఠశాల అభివృద్ధి కోసం తాను మరింతగా శ్రమిస్తానని తెలిపారు.. పాఠశాల విద్యార్థిని యశ్విత మాట్లాడుతూ తమ పాఠశాల అధ్యాపకుల సహకారము తల్లిదండ్రుల తోడ్పాటుతో తాను ఈ మార్కులు సాధించానని వీరితోపాటు పాఠశాల అభివృద్ధి కోసం తోడ్పాటు అందించిన మా ఊరి పెద్దలు కేశవ చౌదరి గారికి పాఠశాల ఉపాధ్యాయులకు పాఠశాల కమిటీ సభ్యులకు విద్యార్థిని కొర్రకూటి యశ్విత ధన్యవాదాలు తెలిపారు.. ఈ సందర్భంగా కేశవ చౌదరిని మండల ఎంఈఓ పాఠశాల హెడ్మాస్టర్ ఘనంగా సత్కరించారు... ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు వేలూరు.రేవతిచౌదరి, మండల ఎంఈఓ మస్తానయ్య, పాఠశాల హెడ్మాస్టర్ సుబ్బయ్య, విద్యా కమిటీ చైర్మన్ మధుసూదన్ నాయుడు, ఉపాధ్యాయులు, సర్పంచ్ మస్తాన్, విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :