Sunday, 26 July 2026 05:14:13 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలి - జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు

25 మండలాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీరు, నీడ సౌకర్యాలను కల్పించిన జిల్లా కలెక్టర్

Date : 12 January 2026 06:39 PM Views : 179

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 12 : మదనపల్లి కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుండీ వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు,జిల్లా సర్వే ఏ.డి భరత్ కుమార్ లు అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని ఆయా శాఖల అధికారులకు డిఆర్ఓ సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారం పై నేరుగా పర్యవేక్షణ చేయడం జరుగుతోందన్నారు. ప్రతి సమస్యను మరియు ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ను ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తుందని, కాబట్టి అధికారులందరూ ప్రాధాన్యతగా ఫిర్యాదులను నూరు శాతం పరిష్కరించాలన్నారు. ఇప్పటికే పెండింగ్ లో నున్న బియాండ్ ఎస్ఎల్ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలన్నారు. సమస్యను పట్టుకొని పరిష్కారం కోసం ఎంతో ప్రయాసతో ప్రజలు అధికారుల వద్దకు వస్తారని, వారి సమస్యను సావధానంగా వినాలన్నారు. సమస్య ఏమిటి, దానిని ఎలా పరిష్కరించాలన్న విషయాలపై అధికారులకు అవగాహన ఉండాలని, చిత్తశుద్ధితో ప్రజల సమస్యలను నాణ్యతగా పరిష్కరించాలని పేర్కొన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి 266 అర్జీలను డిఆర్ఓ స్వీకరించాం, ఈ సమస్యలన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నో వ్యయ ప్రయాసలతో, సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం మదనపల్లికి వచ్చిన అర్జీదారులకు డిఆర్ఓ త్రాగునీరు, నీడ సౌకర్యాలను కల్పించారు. అర్జీ దారులు ఈ సౌకర్యాలను వినియోగించుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: