Sunday, 26 July 2026 04:34:21 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మిట్స్ లో ఏ. ఐ. శిక్షణా కేంద్రం ప్రారంభం

Date : 24 June 2026 05:25 PM Views : 102

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 24 : మదనపల్లె సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ది టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతలను విద్యా, పరిశోధన మరియు పరిపాలనా రంగాలలో సమర్థవంతంగా వినియోగించేందుకు “ఏ ఐ ట్రైనింగ్ హబ్”ను వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ , కృత్రిమ మేధస్సు భవిష్యత్తును నిర్దేశించే కీలక సాంకేతికతగా మారిందని, ఆసక్తి కలిగిన అధ్యాపకులు ముందుకు వచ్చి శిక్షణ పొందాలని తెలిపారు. ఏ ఐ రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు మిట్స్ యూనివర్సిటీ పూర్తి మద్దతు అందిస్తుందని, ఇది కేవలం తొలి దశ మాత్రమేనని, తదుపరి దశల్లో పరిశ్రమలలో అనుభవజ్ఞులైన ప్రముఖ ఏ ఐ నిపుణులను ఆహ్వానించి ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, ఏ ఐ ద్వారా రోజువారీ పనులను మరింత సులభతరం చేసుకునే అనేక అవకాశాలు ఉన్నప్పటికీ వాటి వినియోగంపై చాలామందికి పూర్తి అవగాహన లేదన్నారు. యూనివర్సిటీ లోని సుమారు 400 మంది అధ్యాపకులు, 300 మంది బోధనేతర సిబ్బందిని ఏ ఐ సామర్థ్యాలతో తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మొదటి దశలో అందరికీ అవసరమైన ప్రాథమిక ఏ ఐ సాధనాలపై శిక్షణ అందించగా, రెండో దశలో బోధన, పరిశోధన, పరిపాలన తదితర రంగాలకు అనుగుణంగా ప్రత్యేక మాడ్యూళ్లలో శిక్షణ అందించనున్నట్లు వివరించారు. “(ఫ్యూచర్-రెడీ ఇన్నోవేషన్ @ మిట్స్)Future-Ready Innovation @ MITS” అనే లక్ష్యంతో ప్రారంభమైన ఏ ఐ ట్రైనింగ్ హబ్ ద్వారా జ్ఞానం, నైపుణ్యాలు మరియు సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించి భవిష్యత్‌కు సిద్ధమైన విద్యా వాతావరణాన్ని సృష్టించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. పి. రామనాథన్ మాట్లాడుతూ, నేటి విద్యార్థులు చాట్ జిపిటి, జెమినీ వంటి ఏ.ఐ సాధనాలను విస్తృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో అధ్యాపకులు కూడా AI సాంకేతికతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బోధన, అసైన్‌మెంట్‌ల రూపకల్పన, పరిశోధన, ప్రజెంటేషన్ల తయారీ, జాతీయ విద్యా విధానం (NEP) వంటి విస్తృత పత్రాల విశ్లేషణలో AI ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అధ్యాపకులు నిరంతరం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుంటూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సనత్ హెగ్డే, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: