Sunday, 26 July 2026 11:11:05 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాల ను పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలందించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 08 January 2026 08:43 PM Views : 302

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జనవరి 08 : కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం మదనపల్లి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలపై... పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, సాంఘిక, వెనుకబడిన తరగతుల సంక్షేమ, గిరిజన సంక్షేమ, ఐసిడిఎస్ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలలో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో... పింఛన్ల పంపిణీ, గ్రామపంచాయతీ సేవలు, ఆర్టీసీ సేవలు, రిజిస్ట్రేషన్ సేవలు, తదితర సేవలపై ప్రజల నుండి తీసుకున్న అభిప్రాయాలు, ఎం ఎస్ ఎం ఈ పార్కుల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించగా మదనపల్లె కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... ప్రజలకు సంతృప్తి కరస్థాయిలో సేవలు అందించాలని ప్రజల నుంచి తీసుకున్న అభిప్రాయాలను సమీక్షించుకొని నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఎమ్మెస్ ఎంఈ పార్కుల ఏర్పాటులో భూ సమీకరణ పెండింగ్లో ఉంటే వెంటనే దానిపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :